ముగిసిన మాజీ మావోయిస్టు రాధక్క ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మాజీ మావోయిస్టు రాధక్క ప్రస్థానం

Sep 1 2026 1:31 AM | Updated on Sep 1 2026 1:31 AM

● రిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి

ఆదిలాబాటౌన్‌: మావో యిస్టు ఉద్యమంలో దా దాపు మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కా మ్రేడ్‌ కుర్సంగె మోతిబా యి అలియాస్‌ రాధక్క ప్రస్థానం ముగిసింది. అనారోగ్యంతో ఆదిలా బాద్‌ రిమ్స్‌లో చేరిన ఆమె చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. గత కొంతకాలంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ఉద్యమ సహచరులు సంతాపం తెలిపారు.

దండకారణ్యంలో కీలక బాధ్యతలు

2003లో రాధక్క దండకారణ్యానికి బదిలీపై వెళ్లారు. అక్కడ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించారు. ఈక్రమంలో ఆమెకు గుండె సంబంధిత సమస్య తీవ్రమైంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆమె అరెస్టయ్యారు. 2013–16 వరకు తెలంగాణలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవించారు. ఆ తర్వాత విడుదలయ్యారు. అనంతరం తన సహచరుడితో కలిసి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నివసించారు.

నేడు అంత్యక్రియలు

రాధక్క అంత్యక్రియలు మంగళవారం ఉద యం 11 గంటలకు ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం అంకోలి రోడ్‌లోని వాన్వాట్‌–మామిడిగూడ మధ్యలో గల లింగూగూడలో నిర్వహించనున్నట్లు ఆమె సహచరులు తెలిపారు. ఈ సందర్భంగా రాధక్కకు ఉద్యమ సహచరులు జోహార్లు అర్పించారు.

1984లో ఉద్యమంలోకి..

కామ్రేడ్‌ రాధాక్క 1984లో సీపీఐ(ఎంఎ ల్‌) పీపుల్స్‌వార్‌లో చేరారు. తొలుత సిర్పూర్‌ దళంలో సభ్యురాలిగా పనిచేశా రు. 1986లో పార్టీ సభ్యత్వం పొందారు. 1989లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 2000లో ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యురాలిగా ఎదిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement