రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

నేరడిగొండ: మండల కేంద్రానికి సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిస్తే నేరడిగొండ ఎస్సై 8712659947, లేదా ఇచ్చోడ సీఐ 8712659936 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో మాజీ జవాన్‌ దుర్మరణం

నేరడిగొండ: బోథ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్‌ జక్కులవార్‌ మురళి (39) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన మురళి తిరిగిరాలేదు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నేరడిగొండ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గతంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా దేశానికి సేవలందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement