సారంగపూర్: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ఆస్తపోలు సాయన్న(85) సోమవారం మండలంలోని కౌట్ల(బి)లోని తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యాడు. రాత్రి ఆటోలో మహారాష్ట్రకు వెళ్తుండగా రాంసింగ్ తండా వద్దకు చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్న ముగ్గురు యువకులు ఆటోకు ఎదురుగా వచ్చారు. గమనించిన డ్రైవర్ ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సాయన్న అక్కడికక్కడే మృతి చెందగా అందులో ఉన్న తిరుపతి, లక్ష్మితో పాటు బైక్ నడుపుతున్న ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌కు చెందిన సంజీవ్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రిపుల్‌రైడింగ్ చేస్తూ ప్రమాదానికి కారకుడైన సంజీవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


