దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌ | - | Sakshi
Sakshi News home page

దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: దళితుల అభ్యున్నతికి చివరి వరకు కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రామ్‌ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్వతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం.. ఉప ప్రధానిగా అందించిన సేవలను గుర్తుచేశారు. దళితుల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్‌, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్‌సింగ్‌, డీఈవో భోజన్న, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ నరసింహారెడ్డి, యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఆర్జీయూకేటీలో..

బాసర: బాసర ఆర్జీయూకేటీలో బాబు జగ్జీవన్‌119 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్‌ ముఖ్య జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గో వర్ధన్‌, డాక్టర్‌ గుజ్జర్‌ శంకర్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రేవల్లి అజయ్‌కుమార్‌ మాట్లాడారు. దేశానికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్‌రామ్‌ చేసిన సేవలను కొనియాడారు. యు వత, విద్యార్థులు జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌.శేఖర్‌, కె.మహేశ్‌, ఎస్‌.విఠల్‌, జి.నాగరాజు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

జగ్జీవన్‌రామ్‌ ఆశయ

సాధనకు కృషి చేయాలి

నిర్మల్‌ టౌన్‌: బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక న్యాయ సాధనలో ప్ర ముఖపాత్ర పోషించిన నాయకుడిగా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement