వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
న్యాయమైన పరిష్కారానికి మధ్యవర్తిత్వం
నిర్మల్‌టౌన్: న్యాయవాదులు కేసుల పరిష్కారంలో భాగంగా ఇరు పార్టీల మధ్య న్యాయమైన పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించాలని హైకోర్టు జడ్జీలు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సూరేపల్లి నందా సూచించారు. జిల్లా కేంద్రంలోని వాసవీ వరల్డ్ స్కూల్‌లో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు నిర్వహించే 40 గంటల శిక్షణను ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు స్థానిక అటవీ శాఖ వసతి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఆర్డీవో రత్నకళ్యాణి హైకోర్టు జడ్జీలకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాదాలను పరిష్కరించడానికి న్యాయవాదులు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. మధ్యవర్తిత్వం అనేది న్యాయపరమైన వివాదా లకు ప్రత్యామ్నాయ పరిష్కారమని పేర్కొన్నా రు. కార్యక్రమంలో జడ్జీలు రాధిక, శ్రీనివాస్, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.


