పూర్వ విద్యార్థుల గాజుల పండగ
నిర్మల్‌టౌన్: భారతీయ సంప్రదాయంలో గాజులకు ప్రత్యేకస్థానం ఉంది. గాజులను మహిళలు ఐదోతనానికి ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2008లో ఒకే పాఠశాలలో చదువుకున్న పదో తరగతి విద్యార్థినులు ఆదివారం ఒక్కచోట చేరి గాజుల పండుగ చేసుకున్నారు. ఒకరికి ఒకరు గాజులు వేసుకుంటూ ప్రేమను వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంలోని జుమ్మేరాత్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2008 పదో తరగతి విద్యార్థినులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ క్రమంలో గాజులు వేసుకుని, గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
