
వాతావరణం
ఆకాశం దాదాపు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
పాఠాలుగా చెప్పాల్సిన ఘనత..
‘నిర్మలా.. అదెక్కడుంది..’ అనేవారికి గుర్తుండిపోయే ఎన్నో సమాధానాలను చెప్పే చరిత్ర ఈ నేలకుంది. కానీ.. దశాబ్దాలుగా పాలకులు, అధికారుల పట్టింపులేకపోవడంతో ఆ ఘనతంతా మట్టిలో కలిసిపోతోంది. జలియన్‌వాలాబాగ్ ఘటనకంటే ముందే, అందులో చనిపోయినవారి సంఖ్య కంటే ఎక్కువే ‘వెయ్యిఉరులమర్రి’ ఘటనలో చనిపోయారు. కానీ ఇప్పటికీ వారి పోరుగాథను, త్యాగాల చరితను పాఠ్యపుస్తకాల్లో పాఠంగా పెట్టకపోవడం దారుణం. కనీసం స్వాతంత్య్రదినోత్సవ, ప్రజాపాలన దినోత్సవ అధికారిక ప్రసంగాల్లోనూ ప్రస్తావించకపోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు.
ప్రాణత్యాగాలూ గుర్తించరా..!?
నిర్మల్ గడ్డపై ప్రాణత్యాగం చేసిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరులకు గుర్తింపునివ్వాలి. వారిపోరును పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా చేర్చాలి.
– వెంకటేశ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వాలదే బాధ్యత..
చరిత్రపుటల్లో నిర్మల్ ప్రాంతానికి గుర్తింపు నివ్వడంతోపాటు పాఠాలుగా ముందుతరాలకు అందించాలి. ఇందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు బాధ్యత వహించాలి.
–దిగంబర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ఇంకెప్పుడు గుర్తిస్తారు..!?
తరాలు గడిచిపోతున్నా వెయ్యి ఉరులమర్రి ఘటనకు, జిల్లాకు చెందిన సమరయోధులకు సరైన గుర్తింపుదక్కడం లేదు. పాలకులు, అధికారులు వీరి త్యాగాలను ఇంకెప్పుడు గుర్తిస్తారు..!?
–కై లాశ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లాకార్యదర్శి

వాతావరణం

వాతావరణం