
ప్రజాపాలనతోనే ప్రగతి
న్యూస్‌రీల్
రాచరికానికి ఘోరీకట్టి..
పోరాట స్ఫూర్తితోనే ప్రజాప్రభుత్వం
సమష్టిగా జిల్లా అభివృద్ధి చేసుకుందాం
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం
జిల్లా సమరయోధులను స్మరించని వైనం
నిర్మల్
రైళ్ల ఆలస్యానికి చెక్..!
రైళ్ల ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
గోదావరిలో పెరుగుతున్న వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీతీరంలోని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించడం లేదు.
జాతీయస్థాయి అర్చరీ
పోటీలకు ఎంపిక
కడెం: మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన టేకం సునీల్ జా తీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ అంబేడ్కర్ తెలిపారు. నిర్మల్‌లోని ప్రభుత్వ కళా శాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతు న్న సునీల్ బుధవారం వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో అక్టోబర్ 29న పంజాబ్ రాష్ట్రంలోని భటిండా నగరంలో జరిగే జాతీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు.
నిర్మల్: తెలంగాణ ప్రాంత చరిత్రలో 1948 సెప్టెంబర్ 17కు విశిష్టత ఉందని, రాచరికానికి ఘోరీకట్టి.. ప్రజాపాలనకు హారతిపట్టిన రోజని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజయ్య ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాలను ఆ లపించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసంగపాఠాన్ని చదివి వినిపించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో పథకాలతో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. జిల్లాలో ఈ పథకం ద్వారా లక్షా 28 వేలమందికి లబ్ధి చేకూరుతోందన్నారు. పేదలకు ఉచిత సన్నబియ్యం అందేలా జిల్లాలో 35,769 కొత్త రేషన్ కార్డులను అందించామన్నారు. సెప్టెంబర్‌లో 4,746 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందించామని చెప్పారు. పేదప్రజల ఆరోగ్యానికి భరోసాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యచికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా జిల్లాలో రూ.57కోట్ల 80 లక్షల లబ్ధి చేకూరిందన్నారు. గృహజ్యోతితో పేదల ఇంట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంది స్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాకు 8,852 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 5,265 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలోనే మొదటి స్థానం..
బ్యాంకు లింకేజీ ఎన్‌పీఏ రికవరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించామని సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,058 మహిళాసంఘాలకు రూ.240 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది సీ్త్రనిధి రుణాల కింద ఇప్పటి వరకు రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్‌లో గణపతి మహిళాసంఘం నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ విధానానికి పెప్సికో సంస్థ రివల్యూషనరీ అవార్డు అందించడం ప్రశంసనీయమన్నారు. చేపల ఉత్పత్తిలో మత్స్య సలహాదారు అవార్డును దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమన్నారు. నీతిఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ జాతీయస్థాయిలోనే ఉత్తమ పనితీరుతో నాలుగోస్థానంలో నిలువడం అభినందనీయమన్నారు.
వినూత్నంగా పోలీసుశాఖ..
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పోలీసుశాఖ వినూత్నంగా పనిచేస్తోందని అభినందించారు. నారీశక్తి కార్యక్రమం పేరిట మహిళా పోలీసులతో గస్తీతనిఖీలు చేపడుతున్నామన్నారు. విపత్కర సమయాల్లో అత్యవసరంగా సహాయాన్ని అందించేందుకు శివంగి టీమ్ ముందంజలో ఉంటుందన్నారు. పోలీసుఅక్క కార్యక్రమం పేరిట బాలికల వసతిగృహాల్లో మహిళాపోలీసులు రాత్రివేళల్లో బసచేయడం, వారి సమస్యలను తెలుసుకుంటూ మనోధైర్యం నింపుతున్నారన్నారు. గాంజాగస్తీ పేరిట గంజాయిని అరికడుతూ మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయడం అభినందనీయమన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు అహర్నిశలు అంకితభావంతో సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం భారీ వర్షాల కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయ పత్రాలను అందజేశారు. స్వచ్ఛతాహి సేవ 2025లో భాగంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛోత్సవ్–పక్షోత్సవ్’ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ఆవిష్కరించారు. స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ రాజేశ్ మీనా, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సందేశంలో చోటివ్వరా..!
తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన రోజున నిర్మల్ గడ్డపై పోరాడిన, ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు సరైన గుర్తింపుదక్కక పోవడంపై జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథి సందేశంలో వెయ్యిఉరులమర్రి ఘటనతోపాటు జైళ్లల్లో మగ్గిన సమరయోధుల గురించి ప్రస్తావించకపోవడంపై మండిపడ్డారు.
రైతులకు భరోసాగా..
ప్రజాప్రభుత్వం రైతులకు భరోసాగా వానాకాలం పంట పెట్టుబడిగా లక్షా 85వేల 500మందికి రూ.268 కోట్ల 70లక్షలను ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. 72,500మంది రైతులకు రూ.658 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఇటీవల భారీ వర్షాలకు జిల్లాలో 19,530 ఎకరాల్లో పంటదెబ్బతిందని, బాధిత రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కడెం ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి రూ.5లక్షలు అందించామన్నారు. లక్ష్మణచాంద మండలం మునిపెల్లిలో గోదావరి వరదలో చిక్కుకున్న పశువుల కాపరిని ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షించడంపై కలెక్టర్, ఎస్పీలను అభినందించారు.
రైతులు అధైర్యపడవద్దు
సోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కడా్‌త్‌ల్ సమీపంలో తెగిపోయిన పెద్దచెరువును ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన చెరువుకు మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు.
ప్రజాపాలనకు హారతిపట్టిన రోజు

ప్రజాపాలనతోనే ప్రగతి

ప్రజాపాలనతోనే ప్రగతి

ప్రజాపాలనతోనే ప్రగతి

ప్రజాపాలనతోనే ప్రగతి