
పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే
నిర్మల్‌టౌన్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడుత రవీందర్ అన్నారు. బుధవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రాజులు, భూస్వాములు, రజాకార్ల అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజానీకం చేసిన పో రాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టం అన్నారు. కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఫలితంగానే దొరలు, దేశ్‌ముఖ్‌లు గడీలు వది లి హైదరాబాద్ పారిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు సురేష్, సుజాత, జిల్లా కమిటీ సభ్యులు శంభు, గంగామణి, ముత్యం, తిరుపతి, నారాయణ, సంతోష్ పాల్గొన్నారు.