
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. అనంతరం ఆమె ప్రజా పాలన ప్రాముఖ్యత పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు అందే లాభాలను వివరించా రు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్ మీనా, ఏవో యూనస్ ఆలీ, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీలో..
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, డీన్లు చంద్రశేఖర్, విఠల్, మహేశ్, పీడీ శ్యాంబాబు, పాల్గొన్నారు.