
త్యాగధనుల పోరాటంతో తెలంగాణకు విమోచనం
భైంసా: త్యాగధనుల పోరాటంతోనే తెలంగాణకు విమోచనం కలిగిందని ఎమ్మెల్యే రామరావ్ పటేల్ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ మిల్లులో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం పాలననుంచి విముక్తి కల్పించడానికి కుమురంభీం, రాంజీగోండు లాంటి ఎందరో పోరాట యోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బి. గంగాధర్, నాయకులు రావుల రాము, సుష్మారెడ్డి, గాలి రవి, వడ్నపు శ్రీనివాస్, గౌతం పింగ్లే, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు
భైంసా: కేంద్ర ప్రభుత్వ హయాంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా భైంసాలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ మిల్లులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. భారత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సేవా పక్వాడ్ జిల్లా కో కన్వీనర్ చిన్నారెడ్డి, నాయకులు రావుల పోశెట్టి, మల్లేశ్, సొలంకి భీమ్‌రావు, పండిత్ రావు, దిలీప్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.