‘యాత్రాదానం’ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘యాత్రాదానం’ విజయవంతం చేయాలి

Sep 18 2025 7:43 AM | Updated on Sep 18 2025 7:43 AM

‘యాత్రాదానం’  విజయవంతం చేయాలి

‘యాత్రాదానం’ విజయవంతం చేయాలి

నిర్మల్‌టౌన్‌: ఆర్టీసీ చేపట్టిన యాత్రాదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సోలోమాన్‌ అన్నా రు. బుధవారం నిర్మల్‌ ఆర్టీసీ డిపోను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. బస్టాండ్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, దాతలు, నాయకులు పెద్ద మనసుతో ఆలోచించి పేద విద్యార్థులను, దివ్యాంగులను యాత్రలకు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను బుక్‌ చేయించి ఉదారతను చాటుకోవాలని సూచించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ రీజియన్‌ డిప్యూటీ ఆర్‌ఎం శ్రీహర్ష, నిర్మల్‌ డిపో మేనేజర్‌ పండరి, సహాయ మేనేజర్లు దేవపాల, నవీన్‌ కుమార్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement