
నిర్మల్
న్యూస్‌రీల్
‘కడెం’ ఒక గేటు ఎత్తివేత
కడెం: కడెం ప్రాజెక్టుకు మంగళవారం 8,767 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. అధికారులు ఒక గేటు ఎత్తి 6,364 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
వీరు ఎవరో తెలుసా..!?
ఈ ఫొటో ఎప్పటిదో, ఇందులో ఉన్నవారెవరో తెలుసా..!? కనీసం వీరిని గుర్తుపట్టగలరా..!? వీరు చేసినదేంటో, ఎందుకు వీరిని గుర్తుపెట్టుకోవాలో చెప్పగలరా..!? చెప్పలేరు. ఎందుకంటే.. వీరి గురించి ఎక్కడా రాసింది లేదు, పాఠాలుగా చెప్పిందీ లేదు. వీరంతా నిర్మల్ ప్రాంతంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల్లో కొందరు. నెలలతరబడి జైళ్లల్లో మగ్గిన పోరుబిడ్డలు.
ఈ చెట్టు గురించి చెప్పగలరా..!?
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహ రూపశిల్పి, నిర్మల్‌వాసి బైరోజు వెంకటరమణాచారి(బీవీఆర్.చారి) గీసిన చిత్రమిది. ఈ చిత్రంలో ఉన్న చెట్టు.. దానికి వేలాడుతున్న వెయ్యిమంది మృతదేహాల సంగతి ఎంతమందికి తెలుసు..!? ఇలాంటి దారుణ మారణ ఘటన ఏంటన్న విషయం ఈ తరానికి ఎవరైనా చెప్పారా..? ఏ పుస్తకంలోనైనా, ఏ పాఠంలోనైనా ఉందా..!? లేదు. తెలంగాణలోనే కాదు, దేశచరిత్రలోనే గుర్తుండిపోయేలా చెప్పాల్సిన విషయమిది. ముందుతరాలకు అందించాల్సిన పాఠమిది. రాంజీగోండు సహా వెయ్యిమంది అమరుల ప్రాణత్యాగాలకు ప్రతిరూపమిది. నిర్మల్‌గడ్డను స్వాతంత్య్రపోరులో నిలిపిన ఘట్టమిది.

నిర్మల్

నిర్మల్