
తల్లీబిడ్డా.. ఆరోగ్యంగా ఉండేలా..
స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలు, కూరగాయల వినియోగంపై అవగాహన.
కిశోర బాలికలు, చిన్నారులకు ఎత్తు, బరువు కొలతలు, ఆరోగ్య పరీక్షలు.
తల్లులు, తండ్రులకు అనుబంధ ఆహార తయారీ, వంటకాల పోటీలు.
ఆరోగ్యకరమైన జీవనశైలి, చక్కెర, నూనె వినియోగం తగ్గింపు, శిశు పోషణపై సలహాలు.
0–3 ఏళ్ల పిల్లలకు ఆటలు, కథలు, బొమ్మల ప్రదర్శన ద్వారా ప్రాథమిక విద్య.
ఆకలి పరీక్షలు, గ్రోత్ మానిటరింగ్, ఆరోగ్య పరీక్షలు.
గ్రామ సభలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో శుభ్రతపై ప్రతిజ్ఞ.
నిర్మల్‌చైన్‌గేట్: మాతా–శిశు మరణాల నివారణ, పోషకాహార స్థాయి పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘పోషణ మాసం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 17(బుధవారం) నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ఆహారం, వైద్య పరీక్షలు, విద్యా కార్యక్రమాలతో ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
పౌష్టికాహార పంపిణీ..
అంగన్‌వాడీ కేంద్రాలు గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులకు పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను అందిస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతోపాటు సమతుల మధ్యాహ్న భోజనం, నెలకు 30 గుడ్లు, రోజూ 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తున్నాయి. అంతేకాక, పిల్లల ఎత్తు, బరువు కొలిచి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
పోషకాహార లోపం..
ప్రస్తుతం చాలా మంది తల్లులు, పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. తక్కు వ బరువుతో శిశువులు జన్మించడం, పెరుగుదల ఆ టంకాలు, ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం చేపడుతోంది. ఆరేళ్లలోపు పిల్లలు, గర్భిణులకు స మతుల ఆహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అ ందించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తోంది.
ఇంటింటా అవగాహన..
అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోషకాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆహార ఎంపిక, బరువు నియంత్రణ, ఆరోగ్య సంరక్షణపై సలహాలు అందిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహించే ఈ మాసోత్సవంలో జిల్లా సీ్త్ర–శిశు సంక్షేమ శాఖ అధికారి ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలో సమావేశాలు, కార్యక్రమాలు జరుగనున్నాయి.
పోషణ మాసం కార్యక్రమాలు..
జిల్లా వివరాలు..
మొత్తం మండలాలు 18
ఐసీడీఎస్ క్లస్టర్లు 4
సెక్టార్లు 37
అంగన్‌వాడీ కేంద్రాలు 926