
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
నిర్మల్‌చైన్‌గేట్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజ యం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూ హాలను చర్చించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈనెల 31 నుంచి మీనా క్షి నటరాజన్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 4న ఖానాపూర్ నియోజకవర్గానికి రానున్నారని పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు.