
ప్రచార లోపమే శాపం!
నిర్మల్
● ఎన్‌ఎఫ్‌బీఎస్‌పై అవగాహన కరువు .. ● అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోని వైనం.. ● పేదలకు దక్కని ఆర్థిక భరోసా ● స్కీంను పట్టించుకోని అధికారగణం..
7
‘గిరి’ సంప్రదాయం
కడెం: గిరిజన సంప్రదాయాలు విభిన్నం ఉంటా యి. అడవి బిడ్డలు నేటికీ వాటిని ఆచరిస్తారు. మంగళవారం నాగుల పంచమి పురస్కరించుకుని మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావా స గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉయ్యాలలో మానుక పెట్టి అందులో దీపం వెలిగించి నాగదేవతకు ఆరాధన చేశారు. తర్వాత సంప్రదాయ పాటలు పాడుతూ ఉయ్యాల ఊగారు. పాడి, పంటలు, పిల్లాపా పలను చల్లగా చూడాలని నాగుల పంచమి నుంచి ఐదు రోజులు నిత్యం ఇలా పూజలు నిర్వహించి, ఉయ్యాల ఊగుతారు.
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025
వైద్య సేవలు ఎలా ఉన్నాయి
● జిల్లా ఆస్పత్రిని సందర్శించిన
టీవీవీపీ కమిషనర్
● రోగుల అభిప్రాయం తెలుసుకున్న అజయ్‌కుమార్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా జనరల్ ఆస్పత్రిని తెలంగాణ వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మంగళవారం సందర్శించా రు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కు వచ్చారు. డెంగీతో బాధపడుతున్న రోగులతో మాట్లాడారు. చికిత్స, ఆహారం, మందుల గురించి ఆరా తీశారు. తర్వాత సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో జ్వరాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 9 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారికి మెరుగైనచికిత్స అందిస్తున్నామని వెల్ల డించారు. సమీక్షలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, కమిషనర్ సీసీ జితేందర్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేశ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్‌సింగ్, భైంసా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, నర్సాపూర్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వాలు పథకాలు ప్రారంభించేది ప్రజల కోసమే. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకా ల అమలులో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండేది అధికారులే. సంక్షేమం ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. వాటి గు రించి ప్రజలకు తెలియజేయాలి.. అవగాహన క ల్పించాలి. కానీ, ఓ కేంద్ర పథకాన్ని ప్రజలకు తెలి యజేయడంలో అధికారుల వైఫల్యం.. జిల్లాలోని పేదలకు శాపంగా మారింది. అర్హత ఉన్నా ఆపథ కం ద్వారా ఆర్థిక భరోసా పొందలేకపోతున్నా రు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ పథకం ఉందన్న విషయ మే 90 శాతం మందికి తెలియదు. ఆ పథకమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బె నిఫిట్ స్కీమ్(ఎన్‌ఎఫ్‌బీఎస్). తెల్ల రేషన్ కార్డు కలి గిన నిరుపేద కుటుంబ పెద్ద మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం ఈ పథకం కింద కేంద్రం అందిస్తుంది. అయితే, ఈ పథకానికి జిల్లాతోపాటు రాష్ట్రంలో కూడా సరైన ప్రచారం లేదు. దీంతో అర్హులు దీనిని వినియోగించుకోవడం లేదు. నిర్మల్ కలెక్టరేట్‌లో సోమవారం(జూలై 28న) నిర్వహించిన ప్రజావాణిలో ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ నాయకులు ఈ సమస్యను అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు.
అధికారుల అలసత్వం
రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం గురించి ప్రజల్లో, అధికారుల్లో కూడా తగిన అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. జిల్లాలో ఏటా వందలాది నిరుపేద కుటుంబ పెద్దలు మరణిస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తులు మాత్రం పదుల సంఖ్యలోనే వస్తున్నాయి. ఈ పథకం గురించి తెలియక, కర్మకాండలకు కూడా ఇబ్బంది పడే నిరుపేద కుటుంబాలు సాయం పొందలేకపోతున్నాయని కార్మిక సంఘం ప్రతినిధులు తెలిపారు.
పరిష్కారానికి చర్యలు..
సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ చర్యలు మొదలు పెట్టారు. జిల్లా అధికారులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్‌ఎఫ్‌బీఎస్‌పై ప్రచారం పెంచాలని సూచించారు. 2017 తర్వాత యజమాని మరణించిన కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేయవచ్చు. అదనంగా, కుటుంబ పెద్దగా మహిళ ఉండి ఆమె మరణిస్తే, పిల్లలకు కూడా సాయం అందించేలా పథకం నిబంధనలను సవరించింది కేంద్రం.
ప్రచారం కల్పించాలి...
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కూలీలు, కార్మికులు చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం నిధులు ఉన్నా ప్రజల్లో అవగాహన లేక దరఖాస్తు చేసుకోవడం లేదు. ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే బాధిత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.
– స్వదేశ్ పరికిపండ్ల, ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యులు, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
న్యూస్‌రీల్
ఖజానాలోనే నిధులు..
కేంద్రం ఏటా 7,794 కుటుంబాలకు సాయం అందించేందుకు రూ.15.58 కోట్లు కేటాయింది. రాష్ట్రంలో కేవలం వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లాలో అయితే పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. దీంతో నిధులు ఖజానాలోనే మిగిలిపోతున్నాయి. కొన్నేళ్లలో సుమారు 30 వేల కుటుంబాలకు అందాల్సిన నిధులు మిగిలిపోయాయని ప్రవాసీమిత్ర కార్మిక సంఘం అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం కింద సాయం పొందేందుకు, కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికెట్, భార్య/తల్లి పాస్‌బుక్, మీసేవ కేంద్రం నుంచి అప్లికేషన్ ఫారమ్‌తో దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి, మరణం సాధారణమా, ప్రమాదమా, ఆత్మహత్యా అనే వివరాలతో అఫిడవిట్ అందించాలి. తహసీల్దార్, ఆర్డీవో, డీఆర్వో, కలెక్టర్ ధ్రువీకరణ తర్వాత రూ.20 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి.

ప్రచార లోపమే శాపం!

ప్రచార లోపమే శాపం!