
త్వరలో పట్టాల పంపిణీ
కడెం: పునరావాస ప్యాకేజీలో భాగంగా నిర్వాసితులకు పంపిణీ చేసిన భూములకు రెవెన్యూ పట్టాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాల్లో శుక్రవా రం అధికారులు సమావేశాలు నిర్వహించారు. మరణించిన ఒకరిద్దరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఎంపిక చేసి మొత్తం 94మందితో తుది జాబితా ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో వీరందరికీ పట్టాలు అందుతాయని తహసీల్దార్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్వో అనిత, ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, ఆర్‌ఐ లక్ష్మణ్, సర్వేయర్ ఉమాజీ, హైటికాస్ ప్రతినిధి వెంకట్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.