
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: బాల్యవివాహాలను నియంత్రించాల ని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్యవివా హాల నిర్మూలన, లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, ఇసుక అక్రమ రవాణా, మున్సి పల్ అంశాలు, రహదారి భద్రత, ఎరువులు, విత్తనాల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత అధి కారులతో సమావేశమై మాట్లాడారు. గత రెండేళ్లలో జిల్లాలో 29 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చె ప్పారు. స్కానింగ్, రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాల ను తనిఖీ చేసి అర్హతపత్రాలు పరిశీలించాలని సూ చించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన క ల్పించాలన్నారు. డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయించిన దుకాణాదారులు, డీలర్లపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. బాల్య వివాహాలను నిరోధించడానికి సంక్షేమ, పో లీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపా రు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలోనే ట్రాఫిక్, మ హిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని చెప్పారు. గంజాయి, నిషే ధిత మత్తుపదార్థాలు వినియోగించినా.. రవాణా చేసినా టోల్‌ఫ్రీ నంబర్ 100 లేదా 8712659599కు సమాచారం అందించాలని సూచించారు. అనంత రం మత్తుపదార్థాల నిషేధంపై ముద్రించిన ప్రచార పోస్టర్‌ను కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఆవిష్కరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఏఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఉపేంద్రరెడ్డి, సంక్షేమ, వైద్యారోగ్య, పోలీస్, అబ్కారీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.