
భూముల వ్యవహారం తేల్చాలి
నిర్మల్‌చైన్‌గేట్: గుమ్మేనాఇంగ్లాపూర్ గ్రామంలో రెవె న్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే ని ర్వహించి భూముల స్థితిగతులు తేల్చాలని ఆదివా సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో సాగు భూములపై అటవీశాఖ జోక్యం ఆపాలని శుక్రవారం కలెక్టరేట్‌లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుమ్మేనాఇంగ్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల బీసీ, ఆదివాసీ సామాజిక వర్గాలకు చెందిన వారు 50 ఏళ్లుగా రెవెన్యూ, ప్రభుత్వ, లావోణి పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల అ టవీ అధికారులు ఈ భూములు అటవీశాఖకు చెందినవని పేర్కొంటూ సాగు చేయొద్దని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరి పి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పంద్రం ఆనంద్‌రావు, నాయకులు లింగన్న, బాబురావు ఎల్లయ్య, పోషన్న, పిట్ల ఎల్ల య్య, సాయిరెడ్డి, ఉప్పు రామవ్వ, మక్కల చిన్నక్క, ఇంకవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.