
ముంగిటకే రైతు నేస్తాలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో 75శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీ విస్తున్నారు. అతివృష్టి, అనావృష్టితోపాటు చీడపీడ ల బెడదతో ఎక్కువమంది రైతులు నష్టపోతున్నా రు. ఇలాంటి పరిస్థితి నుంచి అన్నదాతలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వినూత్న కా ర్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ‘మూస ప ద్ధతి మారాలి.. ఫలితం పెరగాలి’ అనే ఆలోచనతో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లి వారి సమస్యలు తెలు సుకుంటున్నారు. సలహాలు, సూచనలు ఇస్తూ రైతులను వానాకాలం సాగుకు సన్నద్ధం చేస్తున్నారు.
ఈ నెల 5నుంచి కార్యక్రమాలు షురూ..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధనాస్థానం, ఏరువాక కేంద్రం, ముధోల్, నిర్మల్ జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖలతో కలిసి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్‌లో కార్యక్రమం నిర్వహించారు. జూన్ 10వరకు జిల్లాలో లోకేశ్వరం మండలం రాజుర, కుంటా ల మండలం అంబకంటి, బాసర మండల మహిళా పూర్‌లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఇందులో స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులూ భాగస్వాములవుతున్నారు.
ఈ అంశాలపైనే ప్రధాన ఫోకస్
దిగుబడి రాక నష్టపోయే రైతులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. వరిలో వెద, పత్తిలో అధిక సాంద్రత పద్ధతులు పాటించా లని చెబుతున్నారు. యూరియా, ఇతర రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువు ల వాడకం పెంచాలని సూచిస్తున్నారు. ఇందుకో సం పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట, జీలుగు, పెసర వేసి కలియదున్నాలని చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇందుకు తక్కువ కాలపరిమితి వంగడాలను సాగుచేయాలని సూచిస్తున్నారు. గట్లపై, ఇతర ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లు నాటాలని చెబుతున్నారు. దీని ద్వారా వాతా వరణంలోని సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని సూచిస్తున్నారు. అన్నిటికన్నా ప్రధానంగా పంట మార్పిడి పద్ధతి పాటించాలని చెబుతున్నా రు. రెండు, మూడేళ్లకోసారి మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పోషక విలువల ఆధారంగా ఇతర ఎరువులు వినియోగించాలని, ఎరువులు కొన్నప్పుడు రశీదు పొంది భద్రపర్చుకోవాలని చెబుతున్నారు. వీటితోపాటు స్థానికంగా ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
అన్నదాతల చెంతకే శాస్త్రవేత్తలు
కొనసాగుతున్న అవగాహన సదస్సులు
సద్వినియోగం చేసుకోవాలి
ఈ నెల 5నుంచి జూన్10 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు రైతులు సద్వి నియోగం చేసుకోవాలి. అవగాహన కార్యక్రమాలతో రైతులకు మేలు జరుగుతుంది.
– అంజిప్రసాద్, డీఏవో
సూచనలు పాటించాలి
వరిలో వెద, పత్తిలో అధికసాంద్రత పద్ధతి పాటించాలి. తక్కువ కాల పరిమితిలో దిగుబడి వచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలి. పంట మార్పిడి, మొక్కజొన్న సాగులో జంట సాళ్ల పద్ధతి అవలంబించాలి. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి.
– నర్సయ్య, ప్రధాన శాస్త్రవేత్త

ముంగిటకే రైతు నేస్తాలు

ముంగిటకే రైతు నేస్తాలు