
ఎక్స్‌రే సేవలు వినియోగించుకోవాలి
● బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ● డిజిటల్ ఎక్స్‌రే మిషన్ ప్రారంభం ● కొనుగోలు కేంద్రం పరిశీలన
నర్సాపూర్ (జి): డిజిటల్ ఎక్స్‌రే సేవలు సద్విని యోగం చేసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వ సతులు లేక ప్రమాదాల్లో గాయపడ్డ వారిని నిర్మ ల్, భైంసా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తుండగా జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. త్వరలో దీనిని 50పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సందర్శించా రు. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరి శీలించారు. సెంటర్ నిర్వాహకులు 3కిలోల చొ ప్పున అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. అధిక తూకం, రై స్ మిల్లుల్లో ధాన్యం కటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎ మ్మెల్యే ఫోన్‌లో ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. డీఎంహెచ్‌వో రాజేందర్, డీసీహెచ్‌ఎస్ సురేశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రమోద్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నా యకులు రావుల రాంనాథ్, దొడ్డికింది ముత్యంరెడ్డి, చంద్రకాంత్, నరేందర్, శ్రీకాంత్‌రెడ్డి, అర్జున్ ఠాకూర్, దత్తురాం, సుధాకర్, రాజేందర్, మహిపాల్, రాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
సారంగపూర్: మండలంలోని సిర్పెల్లి నుంచి బండ్రేవుతండా వరకు రూ.75లక్షలతో చేపట్టిన బీటీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి భూమిపూజ చేశారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోగల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. సారంగపూర్‌లో గన్నీ సంచుల కొరత ఉందని తెలుసుకుని సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడారు. ఆదివారం తప్పనిసరిగా సంచులు తెప్పిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. బీజేపీ మండలాధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు తిరుమలాచారి, నాయకులు సాహెబ్‌రావు, వీరయ్య, చంద్రప్రకాశ్‌గౌడ్, గంగారెడ్డి, విలాస్ తదితరులున్నారు.