
ఘనంగా పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
నిర్మల్‌చైన్‌గేట్: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మ హేశ్‌కుమార్ గౌడ్ జన్మదినాన్ని జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్ ఎంబడి రాజేశ్వర్ ఆ ధ్వర్యంలో పట్టణంలోని నగరేశ్వరవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంత రం డవ్ వృద్ధాశ్రమంలో అనాథలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మహాలక్ష్మివాడలో నిరుపేదల కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కా ర్యక్రమాల్లో కాంగ్రెస్ సేవాదల్ జిల్లా చైర్మన్ కందుల రాజేశ్వర్, కాంగ్రెస్ ఆదివాసీ జిల్లా చైర్మన్ బానావత్ గోవింద్‌నాయక్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రాకేశ్, నాయకుడు నాంపల్లి నర్సయ్య, ఎస్సీ సెల్ నాయకులు తలారి రాజేశ్వర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.