నలభీములకు c/o కుభీర్‌ | - | Sakshi
Sakshi News home page

నలభీములకు c/o కుభీర్‌

May 28 2025 6:09 PM | Updated on May 28 2025 6:09 PM

నలభీమ

నలభీములకు c/o కుభీర్‌

● మండల కేంద్రంలో 20 బృందాలు ● ఏడాది పొడవునా చేతినిండా పని ● జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ వంటల తయారీ

కుభీర్‌: నిర్మల్‌ జిల్లాలోని కుభీర్‌ నలభీములకు (వంట మనుషులకు) ప్రసిద్ధి గాంచింది. మండల కేంద్రంలో సుమారు 20 బృందాలు ఉన్నాయి. ఒక్కో బృందంలో ఒక మాస్టారు, ఇద్దరు లేదా ముగ్గురు సహాయకులు ఉంటారు. అంతేకాకుండా కూరగాయలు కోయడానికి, చపాతీ, పూరీ, లడ్డూ, బాదుషా తయారు చేయడానికి మహిళలను కూలీకి మాట్లాడుకుని వెంట తీసుకెళ్తారు. జిల్లాలోని వివిధ గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాలకు వంటలు చేయడానికి వెళ్తారు. ఒక్కో శుభకార్యానికి మనుషుల లెక్కన రూ.8 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటారు.

ఏడాది పొడవునా పని..

కుభీర్‌కు చెందిన సుమారు 100 మంది మహిళలు, పురుషులకు ఈ రంగంలో ఏడాది పొడవునా ఉపాధి లభిస్తోంది. వెజ్‌, నాన్‌వెజ్‌తో పాటు లడ్డూ, బాదుషా, జిలేబీ, కాకినాడ కాజా, చపాతీ, పూరీ, మజ్జిగ, కార, బూంద, పాపడాలు, అన్నం, పప్పు, కూరగాయలు.. ఇలా అన్నిరకాల వంటలు చేస్తారు. నాన్‌వెజ్‌లో చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, చేపల ఫ్రై, బోటి.. ఇలా అన్నిరకాల వంటలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం ఉన్నవారు రెండు నెలల ముందుగానే ఆర్డర్‌ ఇచ్చి బుక్‌ చేసుకుంటారు. వారి వద్ద వంటకు సంబంధించిన కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తే మరిన్ని పాత్రలు కొనుగోలు చేసుకోవడంతో పాటు మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు.

ప్రధాన వంటాచార్యులు వీరే

కుభీర్‌కు చెందిన ప్రధాన వంటాచార్యులు ఆరె లక్ష్మణ్‌, కందూర్‌ పోతన్న, పెద్ద పోతన్న, బత్తిని సాయన్న, మధు, కిని సంతోష్‌, బ్రాహ్మణ్‌ శేఖర్‌, బ్రాహ్మణ్‌ శేషు, జరి ముత్యం, సిద్దూర్‌ పోతన్న, పోతాజీ, సాకలి రాందాస్‌, కొబ్బాజి పోతన్న, బంక బాబు, బ్రాహ్మణ్‌ రాజు, చవాన్‌ విశ్వనాథ్‌, అడెల్లు, సాయినాథ్‌, గంగాధర్‌ ఉన్నారు.

చేతినిండా పని

మాకు ఏడాది పొడవునా చేతినిండా పని ఉంటుంది. ఎండాకాలంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, చలికాలంలోనూ చిన్నచి న్న శుభకార్యాలు ఉంటాయి. నావద్ద ముగ్గురు అనుచరులు ఉన్నారు. అవసరమైనప్పుడు మహిళా కూలీలను కూడా తీసుకుంటాను.

– బ్రాహ్మణ్‌ శేఖర్‌, వంటాచార్యుడు, కుభీర్‌

ప్రభుత్వం ప్రోత్సహించాలి

నేను 20 ఏళ్లుగా వంటలు చేస్తున్నా. ప్రభుత్వం ప్రోత్సాహం అందించి ఆర్థికసాయం అందిస్తే మరిన్ని వంటపాత్రలు కొనుగోలు చేసి మరికొందరికి ఉపాధి కల్పిస్తా.

– ఆరె లక్ష్మణ్‌, వంటాచార్యుడు, కుభీర్‌

నలభీములకు c/o కుభీర్‌1
1/2

నలభీములకు c/o కుభీర్‌

నలభీములకు c/o కుభీర్‌2
2/2

నలభీములకు c/o కుభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement