
శాశ్వత భవనం నిర్మించాలి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీ ఎస్ మూడో సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిర్మల్‌లో శాశ్వత భవన నిర్మాణం చేపట్టా లని కళాశాల ప్రిన్సిపాల్ ఓరుగంటి శ్రీనివాస్ డీఎంఈ నరేంద్రకుమార్‌ను కోరారు. ఈ మేరకు శనివా రం హైదరాబాద్‌లో రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎ డ్యుకేషన్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం కోసం బస్సు వేయాలని, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలని, కళాశాలలో మంటలు ఆర్పే పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఎంఈ సానుకూలంగా స్పందించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రిన్సిపాల్ వెంట వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మనోజ్‌కుమార్ ఉన్నారు.