
కర్ణాటక: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు.
పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది.
ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు.