ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? భవిష్యత్తుపై బెంగలో 500 మంది | Where Will We Go What Will We Do Delhi Gymkhana Staff Fear For Future Sparks Panic Among 500 Employees | Sakshi
Sakshi News home page

ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? భవిష్యత్తుపై బెంగలో 500 మంది

May 25 2026 4:02 PM | Updated on May 25 2026 5:19 PM

Where Will We Go What Will We Do Delhi Gymkhana Staff Fear For Future

ఢిల్లీ జింఖానా క్లబ్‌ ఖాళీకి కేంద్రం ఆదేశాలు

రోడ్డున పడతామంటూ 500 మంది ఉద్యోగుల ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్‌ను జూన్‌ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులు రోడ్డెక్కారు. ముందస్తు సమాచారం లేకుండా వచ్చిన ఈ అకస్మాత్తు నోటీసుతో, క్లబ్‌లో పనిచేస్తున్న దాదాపు 500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల విషయంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఆందోళనలో 500 మంది
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తమ పరిస్థితి ఏంటీ, ఎక్కడి పోవాలి, తమ భవిష్యత్తు ఏంటి? అని వాపోతున్నారు. ‘మమ్మల్ని జూన్ 5కల్లా క్లబ్ ఖాళీ చేయాలని చెప్పారు. మాకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదు. ఇక్కడ ముప్పై, నలభై ఏళ్లుగా పనిచేస్తున్నాం.. ఇప్పుడు మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు" అంటూ క్లబ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విన్నప్పటి నుండి సిబ్బంది అంతా షాక్‌లో ఉన్నారని, తమ భవిష్యత్తు ఏంటో తెలియక నిరంతరం ఫోన్లు చేస్తున్నారని యూనియన్ చీఫ్ నందన్ నేగి తెలిపారు.

క్లబ్ యాజమాన్యం స్పందన
మరోవైపు నాలుగు ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మే 25న ఢిల్లీ జింఖానా క్లబ్ యాజమాన్యం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌కు లేఖ రాసింది.  క్లబ్ నిర్వహణకు ప్రత్యామ్నాయంగా మరెక్కడైనా తగిన స్థలాన్ని కేటాయిస్తారా?, క్లబ్‌ నమ్ముకుని ఉన్న 500 మంది ఉద్యోగులు, సిబ్బంది భవిష్యత్తుకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? అని కోరింది. దీనితో పాటు, క్లబ్ గవర్నింగ్ బాడీ ఈ ఖాళీ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను చర్చించడానికి ల్యాండ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌తో సమావేశం కావాలని అభ్యర్థించింది.

కాగా ప్రధానమంత్రి అధికారిక నివాసానికి సమీపంలో  ఉన్న చారిత్రాత్మక 'ఢిల్లీ జింఖానా క్లబ్' భూమిని తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.  27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న  ఈ స్థలం అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన ప్రాంతం పరిధిలోకి వస్తుందని ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని, ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్' మే 22న ఈ నోటీసు జారీ చేసింది.

ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం
ఢిల్లీ జింఖానా.. దేశంలోని పురాతన, ప్రముఖ క్లబ్‌లలో ఒకటి. 1913 జులైలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పట్లో దీన్ని ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ గా పిలిచేవారు. స్పెన్సర్ హార్కోర్ట్ బట్లర్ దీనికి మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1947లో స్వాతంత్య్రానంతరం ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించింది అప్పటి ప్రభుత్వం. దీంతో ఢిల్లీ జింఖానా క్లబ్‌గా మారింది. క్లబ్ ప్రారంభ రోజుల్లో పోలో క్లబ్ జింఖానాలో భాగంగా కొనసాగింది.  ప్రస్తుతం 5,600 మందికి పైగా సభ్యులు, సుమారు 500 మంది సిబ్బంది ఉన్నారు.
ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
22 ఏళ్లకే ఆరో సారి : ఇంకో కొడుకు కావాలి! నెటిజన్లు ఫైర్‌!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement