ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ | Student witty Mumbai Indians dig Nita Ambani bursts into laughter | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ

May 25 2026 12:47 PM | Updated on May 25 2026 4:13 PM

Student witty Mumbai Indians dig Nita Ambani bursts into laughter

సాక్షి,ముంబై:  ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ఒకవిద్యార్థి ప్రసంగం నెట్టింట  వైరల్‌గా మారింది. అందులోనూ ముంబై ఇండియన్స్‌ను ఉద్దేశించి చమత్కారంగా ప్రస్తావించడంతో ఊహించని విధంగా నవ్వుల పువ్వులై పోయారు. మరీ ముఖ్యంగా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ  (Nita Ambani) కూడా నవ్వు ఆపుకోలేక పోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.

2026 బ్యాచ్ స్నాతకోత్సవ వేడుకకు సంబంధించిన ఒక వీడియోలో అంబానీ కుటుంబానికి చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీపై  ఆ విద్యార్థి సరదా  వ్యాఖ్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సాధారణంగా స్నాతకోత్సవ ప్రసంగాలు భావోద్వేగపూరితమైన స్మృతులు, భవిష్యత్ సలహాలతో నిండి ఉంటాయి. కానీ ఈ విద్యార్థి క్రికెట్ హాస్యాన్ని జోడించి, అక్కడున్నవారినందరినీ ఆకట్టుకున్నాడు.

 

ఈ సందర్బంగా  ఆ హెడ్ బాయ్ విద్యార్థుల పాఠశాల ప్రయాణాన్ని ,తాము కలిసి పంచుకన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నాడు. స్నాతకోత్సవం తర్వాత జీవితం గురించి మాట్లాడుతూ, "మన ప్రియమైన ముంబై ఇండియన్స్ (MI) లాగే, జీవితంలోనూ  కష్టమైన కాలాలు (సీజన్స​) ఉంటాయి’’ అని అనడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్‌ పోయారు. ఆ తర్వాత అతను ప్రసంగాన్ని కొనసాగిస్తూ,  “ఏదీ సరిగ్గా జరగనట్లు అనిపించే  సీజన్స్‌, మన శ్రమకు  తగ్గ ఫలితాలు రానప్పుడు, ప్రతీదాన్నీ ప్రశ్నించుకునే చోట..ఈ ఫ్రాంచైజీ మనందరికీ నేర్పిన ఒక విషయం ఏమిటంటే, మీరెవరో ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ వారసత్వాన్ని, మీకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు,” అని అతను వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. దీంతో కెమెరా నీతా అంబానీ వైపు మళ్లింది. ఆ ఊహించని వ్యాఖ్యకు ఆమె నవ్వుతూ ముఖం చేతులతో కప్పుకోవడం కనిపించింది.

అక్కడితో ఆగిపోలేదు.. అతను ముంబై ఇండియన్స్ నినాదాన్ని ప్రస్తావిస్తూ, “'దునియా హిలా దేంగే హమ్' అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి” అనడంతో  నీతా  సహా అందరూ  ఆప్యాయంగా నవ్వుతూ చప్పట్లు మారు మోగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పీవీ సింధుతో సహా పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేశారు.  ఈ యువ పిడుగు చమత్కారానికి ఇంటర్నెట్ కూడా పాజిటివ్‌గా స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement