రేయ్‌! రేయ్‌!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!!

Unhooked Tractor Trolley Rolls Back On Street Crashes Onto Electrical Pole And Turns Light  - Sakshi

ఒక్కోసారి అనుహ్యంగా జరిగే ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే, అటువంటి ఘటనల్లో ఎవ్వరికీ ఏం నష్టం జరగకపోతే పర్వాలేదు గానీ ఊహించని విధంగా ప్రాణం నష్టం సంభవిస్తే మాత్రం పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది. తాజాగా అటువంటి ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

(చదవండి: రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ)

వీడియో ప్రకారం.. ఏమైందో తెలియదు గానీ, చెరకు లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీ భాగం ఒక్కసారిగా ప్రజల మీదకు దూసుకొస్తోంది. ఊహించని ఘటనతో కంగుతిన్న అక్కడున్నవారు అప్రమత్తమై తప్పుకోండి.. తప్పుకోండి అని అరవడం మొదలెట్టారు. మరికొంతమంది అలవాటులో పొరపాటుగానో.. లేక నిజంగానే అంత బలమైన, వేగంతో పరుగెడుతున్న ట్రాలీని ఆపగలమనే భ్రమతోనో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇక లోడ్‌తో ఉన్న ట్రాలీ జనం మధ్యగుండా వేగంగా వెనక్కి వెళ్లి ఓ కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. విషయం ఏంటంటే.. ఓ ట్రాక్టర్‌ చెరకు లోడ్‌తో వచ్చింది. దానిని అన్‌లోడ్‌ చేద్దామని.. ట్రాలీని ఇంజన్‌ భాగం నుంచి వేరు చేశారు. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రాలీని ఇంజన్‌ నుంచి విడదీయడంతో అది ఒక్కసారిగా వెనక్కి లగెత్తింది. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే.. అప్పటి వరకు అక్కడ చీకటి కమ్ముకోగా.. ట్రాలీ ఢీకొట్టడంతో స్తంభానికి ఉన్న లైట్‌ ఒక్కసారిగా వెలిగింది. "ఏవిధంగా ట్రాలీని ఆపగలమనుకుని పరుగెడుతున్నారంటూ" కొందరు నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేశారు.

(చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్‌ షేర్‌ చేయడంతో పరార్‌!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top