Top 10 Telugu Current News: Morning Headlines Today 18th April 2022 10AM - Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Apr 18 2022 10:00 AM | Updated on Apr 18 2022 12:53 PM

Top 10 Telugu Latest Current News Morning Headlines Today 18th April 2022 10AM - Sakshi

1.. Russia-Ukraine war: లొంగిపోతే ప్రాణభిక్ష
ఉక్రెయిన్‌లోని కీలక రేవు నగరం మారియుపోల్‌పై రష్యా సైన్యం దాదాపుగా పట్టు బిగించింది. అక్కడ మిగిలిఉన్న కొద్దిపాటి ఉక్రెయిన్‌ సైనికులు మధ్యాహ్నంలోగా ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ జనరల్‌ మిఖాయిల్‌ మిజింట్‌సెవ్‌ ఆదివారం హెచ్చరించారు. 

2.. ఉంగరం దొంగలు మీరేనా?
సింహాద్రి నాథుడి ఉంగరం పోయింది. దానికోసం అన్వేషించే క్రమంలో భక్తులను బంధించి విచారించే కార్యక్రమం జరిగింది. అలా అర్చకులకు చిక్కిన విద్యార్థినులు ఉంగరం చోరీలో తమ ప్రమేయం లేదని మొరపెట్టుకున్నారు.

3.. ఆ అభ్యర్థులకు నిరాశ! టెట్‌లో ప్రత్యేక పేపర్‌ లేనట్టే...
భాషాపండితులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచనేమీలేదని అధికారవర్గాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది భాషాపండితులు నిరాశకు గురయ్యారు.

4.. IPL 2022: ఐపీఎల్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ అరుదైన రికార్డు.. తొలి భార‌త పేస‌ర్‌గా..!
ఐపీఎల్‌లో టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో 150 వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి భార‌త పేస‌ర్‌గా బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు.

5.. Divi Vadthya: దివి హీరోయిన్‌గా నటించిన లంబసింగిలోని కొత్త సాంగ్‌ విన్నారా?
భరత్‌ హీరోగా, బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా నటించిన చిత్రం లంబసింగి. ఎ ప్యూర్‌ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్‌ నిర్మించారు. ఈ సినిమాలోని తొలి పాట 'నచ్చేసిందే నచ్చేసిందే...'ని అక్కినేని నాగార్జున రిలీజ్‌ చేశారు. 

6.. కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్‌లైన్‌ షాపింగ్‌. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్‌. లేదా స్పెండ్‌ నౌ పే లేటర్‌. అమెజాన్‌ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల వరకు క్రెడిట్‌ ఇచ్చేందుకు బారులు తీరాయి. 

7.. కర్ణాటకలో అల్లర్లు.. సోషల్‌ మీడియా పోస్టుతో రగడ
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక సోషల్‌ మీడియా పోస్టు భారీ విధ్వంసానికి కారణమైంది. కోపోద్రిక్తులైన ఒక వర్గం విధ్వంసానికి పాల్పడడంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆస్పత్రి, ఆలయం కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. 

8.. వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..!
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇటీవల జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. దానికి సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు.

9.. రూ.600 కోట్లతో 3 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ 
రాష్ట్రంలో మూడు రైల్వేస్టేషన్లను మల్టీమోడల్‌ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వేస్టేషన్లను అందుకోసం ఎంపిక చేసింది. మొదట పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ భావించింది. 

10. బ్యాక్టీరియాతో విద్యుదుత్పాదన
నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం.. అన్నాడో కవి. నా ఉచ్ఛ్వాసం మీథేన్‌.. నా నిశ్వాసం విద్యుత్‌.. అంటున్నాయి ఒక రకం బ్యాక్టీరియాలు. మానవాళిని వేధిస్తున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన కొరతకు అవి సమాధానం చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement