మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు

Threatening Email Warning Bomb In Delhi Bound Flight From Moscow - Sakshi

న్యూఢిల్లీ: మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని అంతర్జాతీయ మిమానాశ్రయానికి గురువారం రాత్రి 11.15 నిమిషాలకు మాస్కో విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్‌ హెచ్చరికి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. అంతేగాదు విమానాశ్రయ భద్రతను కూడా పెంచారు. ఈ మేరకు విమానం ఎస్‌యూ 232 శుక్రవారం తెల్లవారుజామున 3.20 గం.లకు మాస్కో నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 386 మంది ప్రయాణికులను సుమారు 16 మంది సిబ్బందిని తక్షణమే దించేశారు. విమానం మొత్తం తనీఖీ చేయడం ప్రారంభించారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే గతనెల సెప్టెంబర్‌10న లండన్‌కి వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిన సంగతి తెలిసింది. 

(చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్‌.. వీడియో వైరల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top