టీబీ బాధితుల్లో మరణాల ముప్పు ఎక్కువే | Sakshi
Sakshi News home page

టీబీ బాధితుల్లో మరణాల ముప్పు ఎక్కువే

Published Mon, Jul 11 2022 6:05 AM

TB patients at higher mortality risk even after treatment - Sakshi

న్యూఢిల్లీ: క్షయ వ్యాధి బాధితుల్లో మరణాల రేటు ఎక్కువగానే ఉంటోందని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ట్యుబర్‌క్యులోసిస్‌(ఎన్‌ఐఆర్‌టీ) తెలిపింది. క్షయ బాధితుల ఆయుర్దాయం తక్కువేనని పేర్కొంది. ఆధునిక వైద్య చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా ఇటీవలి కాలంలో క్షయ బాధిత మరణాలు క్రమేపీ తగ్గుతున్నాయని చెన్నైలోని ఎన్‌ఐఆర్‌టీ డైరెక్టర్‌  పద్మా ప్రియదర్శిని చెప్పారు.

అయితే, చికిత్స పూర్తి చేసుకున్న బాధితుల ఆయుర్దాయం రేటు ఆందోళనకరంగానే ఉంటోందని అన్నారు. మిగతా వారితో పోలిస్తే టీబీ వ్యాధి బాధితుల్లో అకాల మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. చికిత్స పూర్తయిన తర్వాతి సంవత్సరమే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించామన్నారు. బాధితుల్లో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్థారణయిందన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement