breaking news
Tuberculosis center
-
టీబీ బాధితుల్లో మరణాల ముప్పు ఎక్కువే
న్యూఢిల్లీ: క్షయ వ్యాధి బాధితుల్లో మరణాల రేటు ఎక్కువగానే ఉంటోందని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ) తెలిపింది. క్షయ బాధితుల ఆయుర్దాయం తక్కువేనని పేర్కొంది. ఆధునిక వైద్య చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా ఇటీవలి కాలంలో క్షయ బాధిత మరణాలు క్రమేపీ తగ్గుతున్నాయని చెన్నైలోని ఎన్ఐఆర్టీ డైరెక్టర్ పద్మా ప్రియదర్శిని చెప్పారు. అయితే, చికిత్స పూర్తి చేసుకున్న బాధితుల ఆయుర్దాయం రేటు ఆందోళనకరంగానే ఉంటోందని అన్నారు. మిగతా వారితో పోలిస్తే టీబీ వ్యాధి బాధితుల్లో అకాల మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. చికిత్స పూర్తయిన తర్వాతి సంవత్సరమే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించామన్నారు. బాధితుల్లో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్థారణయిందన్నారు. -
టీబీ కేంద్రంలో నిధుల మేత
గుంటూరు మెడికల్: జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో నిధులను ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ కేంద్రం పరిధిలో ఎక్కువశాతం మంది సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్టెక్నీషియన్లు కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి టీఏ, డీఏలు ఇవ్వకూడదు. కార్యాలయ అధికారులు, సిబ్బంది నిబంధనలను పక్కనపెట్టి ఎనిమిది మంది కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కు ఆరునెలలుగా ఒక్కొక్కరికి నెలకు 18వేల రూపాయల చొప్పున చెల్లించారు.వ్యాధి నిర్ధారణ కోసం రోగి కళ్లెను సేకరించి దానిని హైదరాబాద్ పంపటానికి ఉపయోగించే థర్మాకోల్ బాక్స్‌లను జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఇరువురు కాంట్రాక్ట్ ఉద్యోగుల చేత కొనుగోలు చేయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్తిపాడులో పనిచే స్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహించకుండానే అలవెన్స్‌లు అన్నీ దిగమింగుతున్నాడు. రోగులను గుర్తించేందుకు, రోగులుచేత రెగ్యులర్‌గా మందులు మింగిస్తూ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రభుత్వం ఉద్యోగులకు టూవీలర్స్ అందజేసింది. వాహనాలపై తిరగకుండానే కొందరు ఉద్యోగుల ఫోన్లలో సమాచారం సేకరిస్తూ పెట్రోలు బిల్లులు తీసుకుంటున్నారు. కార్యాలయంలో ఫైళ్లు భద్రం చేసేందుకు అవసరమైన బీరువాలను కార్యాలయం సిబ్బంది మార్కెట్ ధర కంటే అధిక ధరలకు కొనుగోలు గుంటూరు మెడికల్: జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో నిధులను ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ కేంద్రం పరిధిలో ఎక్కువశాతం మంది సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్టెక్నీషియన్లు కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి టీఏ, డీఏలు ఇవ్వకూడదు. కార్యాలయ అధికారులు, సిబ్బంది నిబంధనలను పక్కనపెట్టి ఎనిమిది మంది కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కు ఆరునెలలుగా ఒక్కొక్కరికి నెలకు 18వేల రూపాయల చొప్పున చెల్లించారు.వ్యాధి నిర్ధారణ కోసం రోగి కళ్లెను సేకరించి దానిని హైదరాబాద్ పంపటానికి ఉపయోగించే థర్మాకోల్ బాక్స్‌లను జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఇరువురు కాంట్రాక్ట్ ఉద్యోగుల చేత కొనుగోలు చేయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్తిపాడులో పనిచే స్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహించకుండానే అలవెన్స్‌లు అన్నీ దిగమింగుతున్నాడు. రోగులను గుర్తించేందుకు, రోగులుచేత రెగ్యులర్‌గా మందులు మింగిస్తూ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రభుత్వం ఉద్యోగులకు టూవీలర్స్ అందజేసింది. వాహనాలపై తిరగకుండానే కొందరు ఉద్యోగుల ఫోన్లలో సమాచారం సేకరిస్తూ పెట్రోలు బిల్లులు తీసుకుంటున్నారు. కార్యాలయంలో ఫైళ్లు భద్రం చేసేందుకు అవసరమైన బీరువాలను కార్యాలయం సిబ్బంది మార్కెట్ ధర కంటే అధిక ధరలకు కొనుగోలు.