Russia Ukraine War: రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్‌ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి

Tamil Nadu Student Joined The Ukrainian Military To Fight Russia - Sakshi

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ అనే విద్యార్థి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళాలలో చేరాడు. దీంతో అధికారులు అతని నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిజానికి  సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని కానీ తిరస్కరించబడిందని తెలిపారు.

అయితే సాయినికేష్ 2018లో ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. కానీ అతను జూలై 2022 నాటికి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అతని కుటుంబం సాయినికేష్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది. అతని తల్లిదండ్రులు రాయబార కార్యాలయం సహాయం కోరిన తర్వాత వారు సాయినికేష్‌ను సంప్రదించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలిటరీ దళాల్లో చేరినట్లు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు.

(చదవండి: 'మిలిటరీ ఆపరేషన్' లక్ష్యం 'యుద్ధాన్ని ఆపడమే!: పుతిన్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top