సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు

పాట్నా: 2020లో అత్యంత విషాదం నింపిన ఘటన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. అతడి ఆత్మహత్య అనంతరం జరిగిన పరిణామాలు మరింత ఆవేదనకు గురి చేశాయి. అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ బంధువు బిహార్ మంత్రిగా నియమితులయ్యారు. ఈ వార్తపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు నీరజ్ సింగ్ బబ్లూ సుశాంత్‌కు చుట్టం అవుతారు.
బిహార్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ మంగళవారం చేపట్టారు. కొత్తగా 17 మంది మంత్రులుగా నియమితులు కాగా వారిలో సుశాంత్ కజిన్ నీరజ్ సింగ్ బబ్లూ ఉన్నారు. సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. రాఘోపూర్ స్థానం నుంచి 2005లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2010, 2015, 2020 ఎన్నికల్లో ఉంబర్‌పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు.
బీహార్ బీజేపీ అగ్రనేతల్లో నీరజ్ సింగ్ బబ్లూ ఒకరు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు’ అని ప్రకటించిన వ్యక్తి నీరజ్ సింగ్ బబ్లూ. సోషల్ మీడియాలో ‘జస్టిస్ ఫర్ ఎస్ఎస్ఆర్’ అనే ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. సుశాంత్ మరణం తర్వాత అతడి కుటుంబానికి నీరజ్ సింగ్ బబ్లూ అండగా నిలిచారు.
మరిన్ని వార్తలు