సినిమా హాళ్లు తెరచుకున్నా.. వెళ్లే ప్రసక్తే లేదు!

Survey Only 7 Percent Polled People Plan Go Theatres 2 Months India - Sakshi

లోకల్‌ సర్కిల్స్‌ ఆన్‌లైన్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

న్యూఢిల్లీ: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 15 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు కేంద్రం వెసలుబాటు కల్పించినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు పడటం లేదు. మరికొన్ని రాష్ట్రాలు ఇందుకు అంగీకరించినా.. యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమంటూ ఎగ్జిబిటర్లు తేల్చిచెప్తున్నారు. మరోవైపు.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడ్డ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రాలను వెండితెర మీద ప్రదర్శించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరి, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రేక్షకులు నిజంగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలానుకుంటున్నారా? రానున్న రెండు నెలల్లో కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్‌కు వెళ్లేందుకు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? అన్న అంశాలపై లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.(చదవండి: నవంబర్‌ 30 వరకూ అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ అమలు)

థియేటర్‌కు వెళ్లే ప్రసక్తే లేదు!
ఈ ఆన్‌లైన్‌ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 8274 మంది అభిప్రాయాలు సేకరించగా.. వారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే థియేటర్లకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో 4 శాతం మంది కేవలం కొత్త సినిమా రిలీజ్‌ అయితే మాత్రమే వెళ్తామని చెప్పగా, 3 శాతం మంది.. కొత్త, పాత అనే తేడా లేకుండా థియేటర్‌లో ఏ సినిమా అయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక అత్యధికంగా 74 శాతం మంది మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండగా, 2 శాతం మంది కచ్చితమైన అభిప్రాయమేదీ వెల్లడించలేదని సర్వే పేర్కొంది. మిగిలిన 17 శాతం మంది మాత్రం థియేటర్‌లో సినిమా చూసే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేసినట్లు తెలిపింది.

కాగా లోకల్‌సర్కిల్స్‌ జూలైలో నిర్వహించిన సర్వేలో, 72 శాతం మంది, ఆగష్టునాటి సర్వేలో 77 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో తాము థియేటర్లకు వెళ్లేందుకు ఏమాత్రం సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫాంలవైపే మొగ్గుచూపుతున్నారని వెల్లడైంది. వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రానందున ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేందుకు ఇష్టపడతున్నట్లు పేర్కొంది. కాగా కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా, గత ఏడు నెలలుగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినీరంగం కుదేలైంది. సినీ కార్మికులు, జూనియర్‌ ఆర్టిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

దీంతో కొంతమంది తాత్కాలిక ఉపాధి మార్గాల వైపు మళ్లగా, మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ సహా ఈశాన్య రాష్ట్రాలు థియేటర్ల ఓపెనింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్, బెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీ తదితర 14 రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకున్నాయి.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

27-11-2020
Nov 27, 2020, 17:34 IST
న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్‌ డీల్‌ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు...
27-11-2020
Nov 27, 2020, 13:50 IST
మాస్కో/ హైదరాబాద్‌: దేశీయంగా రష్యన్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్‌ డైరెక్ట్‌...
27-11-2020
Nov 27, 2020, 11:47 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌...
27-11-2020
Nov 27, 2020, 10:44 IST
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం...
27-11-2020
Nov 27, 2020, 09:26 IST
ముంబై, సాక్షి: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే మార్చికల్లా కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే వీలున్నట్లు దేశీ ఫార్మా...
27-11-2020
Nov 27, 2020, 08:22 IST
అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు కరోనా పేషెంట్లు...
27-11-2020
Nov 27, 2020, 08:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : రోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు...
26-11-2020
Nov 26, 2020, 19:24 IST
‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప...
26-11-2020
Nov 26, 2020, 16:35 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్‌మాస్క్‌ ధరించడం అనివార్యంగా మారిపోయింది.
26-11-2020
Nov 26, 2020, 13:30 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కట్టికి బ్రిటిష్‌, స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌...
26-11-2020
Nov 26, 2020, 13:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ అమ్మకాలకు కరోనా వైరస్‌ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో...
26-11-2020
Nov 26, 2020, 12:07 IST
సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు...
26-11-2020
Nov 26, 2020, 10:02 IST
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో...
26-11-2020
Nov 26, 2020, 09:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి....
26-11-2020
Nov 26, 2020, 08:25 IST
భోపాల్‌: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో మహమ్మారి బారిన పడిన ఓ యువ వైద్యుడు కన్నుమూశాడు. నెలరోజుల పాటు...
26-11-2020
Nov 26, 2020, 04:28 IST
గుంటూరు మెడికల్‌:  కోవిడ్‌–నివారణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ బుధవారం గుంటూరు...
26-11-2020
Nov 26, 2020, 02:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకాను మొదటి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది....
25-11-2020
Nov 25, 2020, 19:01 IST
మలేసియాకు చెందిన ‘టాప్‌ గ్లోవ్‌’ కంపెనీలో ఊహించని సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
25-11-2020
Nov 25, 2020, 18:32 IST
దేశంలో కరోనా కేసులు కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
25-11-2020
Nov 25, 2020, 15:26 IST
కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ, మరణాలు తక్కువగా ఉండడానికి కూడా కారణాలు తెలియడం లేదు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top