నవంబర్‌ 30 వరకూ అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ అమలు

Unlock 5 Guidelines To Remain In Force - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తూ సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయాలని పేర్కొంది. ప్రభుత్వం అనుమతించిన సేవలు మినహా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత యధావిధిగా కొనసాగుతుంది. దశలవారీగా స్కూళ్లు, విద్యాసంస్ధలను తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. చదవండి : భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top