డాక్టర్‌పై అఘాయిత్యం కేసు విచారణ బెంగాల్‌లోనే | Supreme Court Refuses To Transfer RG Kar Rape And Murder Case To Another State, More Details Inside | Sakshi
Sakshi News home page

డాక్టర్‌పై అఘాయిత్యం కేసు విచారణ బెంగాల్‌లోనే

Nov 8 2024 6:30 AM | Updated on Nov 8 2024 11:05 AM

Supreme Court refuses to transfer RG Kar rape and murder Case

బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరణ  

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. పశి్చమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై చోటుచేసుకున్న అఘాయిత్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ ఆరో స్టేటస్‌ రిపోర్టును సుప్రీంకోర్టులో సమరి్పంచింది. వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్‌ రూపొందించడానికి ఏర్పాటైన నేషనల్‌ టాస్‌్కఫోర్స్‌(ఎన్‌టీఎఫ్‌) సైతం తమ నివేదికను అందజేసింది.

 ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ఈ నివేదికను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని ఎన్‌టీఎఫ్‌కు సూచించింది. 10 మంది సభ్యులతో ఎన్‌టీఎఫ్‌ను సుప్రీంకోర్టు గతంంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పశ్చిమబెంగాల్‌లోనే కొనసాగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌పై కోల్‌కతా కోర్టులో ఈనెల 4న అభియోగాల నమోదయ్యాయని, ఈ నెల 11 నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement