బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్‌.. | Submerged Trucks Pulled Out Of River In Bihar | Sakshi
Sakshi News home page

బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్‌..

Jul 7 2023 2:01 PM | Updated on Jul 7 2023 7:02 PM

Submerged Trucks Pulled Out Of River In Bihar - Sakshi

పట్నా: బిహార్‌లోని సోన్‌ నదిలో చిక్కుకున్న లారీలను బయటకు తీస్తున్నారు అధికారులు. ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఆ దృశ్యాలు బీతికొల్పుతున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సగం లారీ మునిగిపోయినప్పటికీ ప్రవాహంలో వాహనాలను బయటికి తీయడం సాహసంతో కూడిన పని అని నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. సోన్ నదీ ప్రవాహంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు.  

ఇటీవల కురిసిన విపరీత వర్షాల కారణంగా సోన్‌ నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటికే నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న 28 లారీలు నదిలో చిక్కుకుపోయాయి. అదీగాక జులై 1 నుంచి సోన్ నదిలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత వారం రోజుల నుంచి వాహనాలను బయటికి తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

అయితే.. రోహ్టాస్ జిల్లాలో ఖటూర్‌ బాలు ఘాట్‌ వద్ద లారీలను నదిలో వరద నీరు ఉద్దృతంగా ప్రవహిస్తున్నప్పటికీ బయటకు తీశారు. వాహనం సగంపైనే మునిగిపోయినప్పటికీ ఏమాత్రం వెనకకు తగ్గకుండా ప్రవాహాన్ని దాటేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఇదీ చదవండి: కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement