కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..!

Rare Brain Disease In Kerala Caused By Free Living Amoebae In Water  - Sakshi

తిరువనంతపురం: కేరళలో మరో అరుదైన బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి వెలుగులోకి వచ్చింది. తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఓ 15 ఏళ్ల వ్యక్తి శరీరంలో గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా  ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. 

స్థానికంగా పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి ఇతర లక్షణాలు రోగిలో గమనించిన వైద్యులు.. షాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. దీంతో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతనిలో ఉన్నట్లు గుర్తించారు. చికిత్సను ప్రారంభించామని తెలిపారు.  

రోగి శరీరంలోకి ముక్కు ద్వారా వ్యాధి కారకం ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. కలుషిత నీటితో స్నానం చేయకూడదని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన అనంతరం మానవ శరీరంలోని మెదడుపై దాడి చేస్తుందని వెల్లడించారు. తీవ్ర జ‍్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని తెలిపారు. 2017లో ఇదే ప్రాంతంలో ఇలాంటి బ్యాక్టీరియా కేసు నమోదైనట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: హైరానా పెడుతున్న హెచ్‌ఐవీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top