‘నా తల్లిదండ్రులు విడిపోయారు.. ఇది చెప్పడానికి 40 ఏళ్లు పట్టింది’

Smriti Irani Opens About Her Parents Separation Says It Took 40 Years - Sakshi

న్యూఢిల్లీ: తన తల్లిదండ్రులు విడిపోయారని చెప్పడానికి 40 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో ఫేమ్ అయిన ఈ నటి తన తల్లిదండ్రుల ఎడబాటు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. అందులో ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు వారి వద్ద కేవలం 150 రూపాయలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇరానీ తండ్రి పంజాబీ-ఖాత్రి కాగా, నటి తల్లి బెంగాలీ-బ్రాహ్మణి. ఆర్థిక పరిస్థితి సరిగాలేని కారణంగా ఆవు షెడ్ పైన ఉన్న గదిలో నివసించేవారని చెప్పుకొచ్చారు.

‘ఆ రోజుల్లో మమ్మల్ని చిన్నచూపు చూసేవారు, అలాంటి జీవితం గడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. జేబులో కేవలం 100 రూపాయలతో మా అందరినీ చూసుకునేవారు. మా నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు, నేను అయనితో కూర్చునేదానిని. మా అమ్మ వేరే ఊళ్ళకి వెళ్ళే మసాలాలు అమ్మేది. మా నాన్న పెద్దగా చదువుకోలేదు, మా అమ్మ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. దీంతో అప్పుడప్పుడు వారి మధ్య విభేధాలు తలెత్తి గొడవలు జరిగేవని’ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అభిప్రాయ భేదాలను కొద్దిమంది మాత్రమే తట్టుకోగలరని ఆమె భావోద్వేగంగా తెలిపారు.

చదవండి: మొదటి రాత్రే భర్త నిజస్వరూపం.. లిప్‌స్టిక్‌ పూసుకుని విచిత్ర ప్రవర్తన!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top