కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ఏప్రిల్‌ 5న విచారణ: సుప్రీం

SC to hear on Apr 5 plea by 14 opposition parties against misuse of central probe agencies  - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా వాడుకుంటోందంటూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌పై ఏప్రిల్‌ 5వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

డీఎంకే, ఆర్జేడీ, బీఆర్‌ఎస్, టీఎంసీ, ఎన్‌సీపీ, జేఎంఎం, జేడీయూ, సీపీఎం ఎస్‌పీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పార్టీలు వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం వాదనలు వింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో 95% ప్రతిపక్ష పార్టీల నేతలపై ఉన్నవేనని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వి తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top