అమిత్‌ షా బర్త్‌డే : ప్రధాని మోదీ శుభాకాంక్షలు | PM Narendra Modi Top Leaders Extend Birthday Greetings To Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా బర్త్‌డే : ప్రధాని శుభాకాంక్షలు

Oct 22 2020 2:55 PM | Updated on Oct 22 2020 3:31 PM

PM Narendra Modi Top Leaders Extend Birthday Greetings To Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి, బీజేపీ దిగ్గజ నేత అమిత్‌ షా గురువారం 56వ సంవత్సరంలో అడుగుపెట్టడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత పురోగతికి అంకితభావంతో కృషి చేస్తున్న అమిత్‌ షాకు దీర్ఘకాలం దేశ సేవలో ముందుకు సాగేందుకు భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బీజేపీ పటిష్టతకు ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని అన్నారు. పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా, సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్‌ షా సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆకాంక్షించారు. చదవండి : ‘పౌర ప్రకంపనల వెనుక విపక్షాలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement