జీరో షాడో డే: మాయమవుతున్న నీడ.. ఏంటిలా

Odisha Witnesses Zero Shadow Day - Sakshi

ఒడిషాలో వెలుగు చూసిన ఖగోళ దృగ్విషయం

భువనేశ్వర్‌: సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం ఎటు వెళితే అటు మన నీడ కూడా పయనిస్తుంది. కానీ ఏడాదిలో రెండు సార్లు మాత్రం ఇలా జరగదు. దీన్నే ‘జీరో షాడో డే’ అంటారు. అంటే ఆ రోజున భూమ్మీద ఉన్న వస్తువులు, మనుషుల నీడలు ఏర్పడవు. దాదాపు రెండు వారాల క్రితం ఈ అరుదైన ఖగోళ దృశ్యం దక్షిణ భారతదేశంలో ఏర్పడగా.. తాజాగా ఈ వింత ఒడిషాలో చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం ఈ వింత చోటు చేసుకుంది. ఉదయం 11:43 గంటల నుంచి దాదాపు 3 నిమిషాల పాటు ఈ వింత కొనసాగింది. 

ఈ సందర్భంగా భువనేశ్వర్‌లోని పఠానీ సమంతా ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సుభేందు పట్నాయక్‌ మాట్లాడుతూ.. ‘‘సూర్యుడు మకరరాశి, కర్కాటక రాశి మధ్య... +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడు ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో.. సరిగా నడినెత్తిన ఉండటం వల్ల నీడ ఏర్పడదు. అప్పుడు సూర్యుడు స్థానిక ధృవరేఖను దాటుతూ వెళ్తాడు. ఈ సమయంలో... సూర్య కిరణాలు తిన్నగా పడతాయి. అందువల్ల భూమిపై ఆ అక్షాంశాల మధ్య ఉన్న వస్తువులు, మనుషుల నీడలు ఏర్పడవు. తిన్నగా పడుతుంది. అందువల్ల ఏ వస్తువునైనా మనం చూసేటప్పుడు మనకు నీడ కనిపించదు’’ అన్నారు. ఇక ఒడిషాలో మే 21 నుంచి జూన్‌ 2 వరకు ఈ వింత కనపడనుంది. 

చదవండి: ఈ రోబోలు నీడను చూసి గుర్తుపట్టేస్తాయి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top