నీడను చూసి గుర్తుపట్టేస్తాయి!

Cornell University Introduce Shadow Sense System Of Robots - Sakshi

చిట్టీ.. ద రోబో గుర్తుంది కదా! అలాంటి రోబోలు నిజ్జంగా వచ్చే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. యజమాని మాటను బట్టి చూపును బట్టి ఆజ్ఞలు స్వీకరించే రోబోలు ఇప్పటికే వచ్చేశాయి. ఇకపై నీడను బట్టి యజమానిని గుర్తుపట్టి ఆజ్ఞలు స్వీకరించే రోబోలు రాబోతున్నాయి. తాజాగా రోబోలు తమ యజమానిని గుర్తుపట్టేందుకు నీడలను విశ్లేషించుకునే అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. జీవుల్లో ప్రాథమిక సమాచార మార్పిడి స్పర్శ ద్వారానే జరిగేది. అనంతరం జీవ పరిణామంలో శబ్దాలు, భాషలు, రాతలు వచ్చాయి.

అయితే రోబోల విషయంలో స్పర్శ ద్వారా యజమానిని గుర్తించేలా చేయడం ఖరీదైన ప్రక్రియ. ఇందుకు రోబో శరీరమంతా సెన్సర్లు అమర్చాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని తొలగించే క్రమంలో తాజా పరిశోధన ఉపయోగపడనుంది. ఈ షాడో సెన్స్‌ సిస్టమ్‌లో యూఎస్‌బీ కెమెరాతో నీడలను రోబోలు గ్రహించుకుంటాయి. అనంతరం ఆల్గారిధమ్స్‌తో నీడను విశ్లేషించుకుంటాయి. పూర్తిస్థాయిలో ఈ ప్రయోగాలు ఫలిస్తే,సెన్సార్‌ స్టిసమ్‌ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశోధన నాయకుడు గైహాఫ్‌మన్‌ చెప్పారు. ప్రస్తుత పరిశోధనలో 96 శాతం వరకు కచ్ఛితత్వంతో కూడిన ఫలితాలు వచ్చాయన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో రోబో రూపకల్పన మరిన్ని కొత్తపుంతలు తొక్కనుంది. 

చదవండి: 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top