Bihar: దగ్గరపడుతున్న ఎన్నికలు.. పింఛను పెంచిన సీఎం నితీష్‌ | Nitish Kumar Hikes Pension for Elderly Disabled Widowed Women | Sakshi
Sakshi News home page

Bihar: దగ్గరపడుతున్న ఎన్నికలు.. పింఛను పెంచిన సీఎం నితీష్‌

Jun 21 2025 1:56 PM | Updated on Jun 21 2025 3:02 PM

Nitish Kumar Hikes Pension for Elderly Disabled Widowed Women

పట్నా:ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఉత్సాహంగా తమ పనులు మొదలుపెట్టాయి. నేడు(శనివారం) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  రాష్ట​ంలోని వృద్ధులు, వికలాంగులు,వితంతువులకు ఇచ్చే నెలవారీ పెన్షన్‌ను రూ.400 నుండి రూ.1,100కి పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని  కోటీ తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది.
 

‘సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇకపై ప్రతి నెలా రూ. 400 కు బదులుగా రూ. 1,100 పెన్షన్ అందజేయనున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. జూలై  నుండి పెరిగిన పెన్షన్ లభిస్తుంది. దీనివలన ఒక కోటి 9 లక్షల 69 వేల 255 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని’ నితీష్‌ కుమార్ ప్రకటించారు. వృద్ధులు సమాజంలో విలువైన భాగస్వాములు,  వారికి గౌరవప్రదమైన జీవితాన్ని  అందించడం మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుంది’ అని ఆయన అన్నారు. ఈ  ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇటువంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇది కూడా చదవండి: కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..
 

Advertisement
 
Advertisement
Advertisement