వాట్సాప్: కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేం!

New privacy policy will take effect from May 15 - Sakshi

ఢిల్లీ: మే 15 నుంచి అమల్లోకి వచ్చిన తమ కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేమని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలిపింది. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లు తమ కొత్త విధానాలను అంగకరించకపోతే.. దశల వారిగా వారి ఖాతాలను నిలిపివేస్తామని పేర్కొంది. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ దిల్లీ హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. "మా గోప్యతా విధానం ఐటి నిబంధనలను అతిక్రమించలేదు అని చాలా స్పష్టమైన ప్రకటన చేశాం, మేము అన్నీ నిబందనల ప్రకారం వెళ్తున్నాం" అని సిబల్ కోర్టుకు చెప్పారు. ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లు యాప్‌ను వాడేందుకు అనుమతించట్లేదంటూ వినిపించిన వాదనలను వాట్సాప్ ఖండించింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్‌ శర్మ.. ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని చెప్పారు. అలాగే దీనిపై కేంద్రం సంస్థ వాట్సాప్ ఉన్నతాధికారులకు లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. మే 15 నుంచి అమల్లోకి వచ్చిన వాట్సాప్ కొత్త విధానంపై న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వైఖరిని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు గతంలో నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉంటే..వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్‌ శర్మ, పిటిషనర్లు కోరగా.. ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.

చదవండి:

అలర్ట్: నెఫ్ట్‌ సేవలకు అంతరాయం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top