ఏసీ కూలింగ్‌ ఇకపై 20 డిగ్రీలే! | New Air Conditioners To Have 20 Degrees C As Minimum Temperature, Know Story Inside | Sakshi
Sakshi News home page

ఏసీ కూలింగ్‌ ఇకపై 20 డిగ్రీలే!

Jun 11 2025 11:22 AM | Updated on Jun 11 2025 12:40 PM

New air conditioners to have 20 degrees C as minimum temperature

అంతకంటే తగ్గించడం కుదరదు ∙త్వరలో కొత్త నిబంధన: కేంద్రం

న్యూఢిల్లీ:  ఏసీ లేనిదే నిద్రపట్టని వారు ఎందరో! కూలింగ్‌ను మాగ్జిమం పెట్టుకుని పడుకుంటే గానీ చాలామందికి రాత్రి తెల్లారదు. అలాంటి వారికి ఇది చేదువార్తే. ఏసీ కూలింగ్‌కు పరిమితి విధించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. దానిప్రకారం కూలింగ్‌ను 20 డిగ్రీల కంటే తగ్గించడం, గరిష్టంగా 28 డిగ్రీల కంటే ఎక్కువ పెట్టుకోవడం కుదరదు. ఈ మేరకు ఏసీ ‘టెంపరేచర్‌ రేంజ్‌’ త్వరలో అమల్లోకి రానుంది.

 ప్రయోగాత్మకంగా ఈ చర్య చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మంగళవారం ప్రకటించారు. తద్వారా మితిమీరిన కరెంటు వాడకానికి అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ నిబంధన ఇళ్లు, ఆఫీసులతో పాటు కార్లకు కూడా వర్తించనుంది. భారత్‌లో ప్రస్తుతం ఏసీల చల్లదనాన్ని 16 నుంచి 30 డిగ్రీల దాకా నియంత్రించుకోవచ్చు.   

Advertisement
 
Advertisement
Advertisement