ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి | NBF applauds Delhi HC order to cable operators to restore blocked news channels in Andhra | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి

Jun 26 2024 4:56 AM | Updated on Jun 26 2024 12:09 PM

NBF applauds Delhi HC order to cable operators to restore blocked news channels in Andhra

‘సాక్షి’ సహా పలు చానళ్ల ప్రసారాలు నిలిపివేతపై కేబుల్‌ ఆపరేటర్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్‌ 6 నుంచి ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ, 10టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ మిని పుష్కర్ణ మంగళవారం విచారించారు. ఆయా చానళ్లను పునరుద్ధరించాలని కేబుల్‌ ఆపరేటర్లను ఆదేశించారు. లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంది. 

ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ (ఎన్‌బీఎఫ్‌) హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకొన్న నిర్ణయంపై కొరడా లాంటి ఆదేశాలుగా అభివరి్ణంచింది. ‘ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించే ప్రాముఖ్యతను హైకోర్టు జోక్యం నొక్కి చెబుతోంది. ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛను సమరి్థంచడం, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంపై ఓ ఉదాహరణగా నిలుస్తుంది’ అని మంగళవారం ఎన్‌బీఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement