
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున 1:00 గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 900 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయని, మరో ఎనిమిదికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయాలపాలైనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాయపడిన ఒక కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ ‘రియాక్టర్ నుండి పొగలు రావడాన్ని చూసి, తామంతా బయటక వచ్చేశామన్నారు. 25 నిమిషాల తర్వాత పేలుడు సంభవించిందని, పేలుడు కారణంగా ఎగిరిపడిన రాళ్ల కారణంగా దాదాపు 50 మంది గాయపడ్డారు’ అని తెలిపారు.
#WATCH | Nagpur, Maharashtra | Explosion in Solar Industries, Bazargaon: An injured worker says, "The incident took place around 12-12:30 AM. When we saw smoke coming from the reactor, we all came out. After continuous smoke for around 20-25 minutes, there was a blast. Due to the… https://t.co/MlKIJsoKFL pic.twitter.com/n9L0vUvgcw
— ANI (@ANI) September 4, 2025
కాగా సోలార్ యూనిట్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారేమీ కాదని, గతంలో కూడా ఇలాంటి పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పోద్దార్ తెలిపారు. కాగా ఈ పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.