Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు | Bihar Election watch Unique Style of Tej Pratap candidates | Sakshi
Sakshi News home page

Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు

Oct 19 2025 11:01 AM | Updated on Oct 19 2025 11:35 AM

Bihar Election watch Unique Style of Tej Pratap candidates

పట్నా: బీహార్‌కు ఎన్నికల పండుగొచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చిత్రవిచిత్రాలు మీడియా కంటపడుతున్నాయి. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులు అందరినీ అకట్టకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు గేదెపై ఊరేగుతూ నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా, మరికొందరు చేతులకు సంకెళ్లు వేసుకుని, మద్దతుదారులను వెంటేసుకుని వస్తున్నారు.
 

లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర కుమార్ శుక్రవారం బరౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్బంగా అతని చేతులకు సంకెళ్లు  ఉన్నాయి. ఈయన కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే విలేకరులు, జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘నేను కుట్రకు బలైపోయాను. అయితే ఇప్పుడు ప్రజల నుండి న్యాయం కోరుకుంటాను’ అని అన్నారు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.  
 

ఇదేవిధంగా అర్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన అరుణ్ యాదవ్ తన నామినేషన్‌ దాఖలు చేసేందుకు గేదెపై స్వారీ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. ఇది అక్కడున్నవారిని అమితంగా ఆకట్టుకుంది.  లాలూ యాదవ్ ఫొటోను పట్టుకుని.. ‘రాజకీయాల్లో తన ఏకైక రోల్ మోడల్ లాలూ అని,  అతని ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను" అని అరుణ్ యాదవ్ మీడియాకు తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీకి చెందిన అభ్యర్థులు విచిత్ర తీరుతెన్నులతో నామినేషన్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌లకు తరలిరావడం విశేషంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement